ఫేస్ బుక్ స్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సక్సెస్ స్టోరీ తెలుగులో:
మార్క్ జుకర్ బర్గ్ 1984 మే 14వ తేదీన ఎడ్వర్డ్ జుకర్ బర్గ్ అనే డెంటిస్ట్ మరియు కరెన్ కెంప్నర్ లకు జన్మించారు. ఆయన తన ముగ్గురు సోదరీమణులతో కలిసి న్యూయార్క్ రాష్ట్రంలో పెరిగారు.
Mark Juckerberg |
మార్క్ మిడిల్ స్కూల్ లో ఉన్నప్పుడు సాఫ్ట్ వేర్ కోడింగ్ రాయడం మరియు కంప్యూటర్ లను ఉపయోగించడం ప్రారంభించాడు. అతని కోడింగ్ అనుభవం అటారీ ప్రాథమిక ప్రోగ్రామింగ్ నేర్చుకోవడంతో ప్రారంభమైంది. తన తండ్రి ఎడ్వర్డ్ జుకర్ బర్గ్ సహాయంతో, అతను చిన్నతనంలోనే కంప్యూటర్ భాషను చాలా వేగంగా నేర్చుకున్నాడు.
జుకర్ బర్గ్ ఉన్నత పాఠశాలలో ఉండగానే, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో ఒక కళాశాల గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ తీసుకున్నాడు. అతను జుక్నెట్ అనే ఒక ప్రోగ్రామింగ్ నిర్మించాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న కంప్యూటర్ తన తండ్రి కంప్యూటర్ తో కమ్యూనికేట్ చేసేలా ప్రోగ్రాం రాశాడు. అతను 12 సంవత్సరాల వయస్సులో అనేక కంప్యూటర్ గేమ్స్ అభివృద్ధి చేశాడు. తన స్నేహితులతో కలిసి కంప్యూటర్ గేమ్స్ ను రూపొందించడానికి అతను తన సృజనాత్మకతను ఉపయోగించాడు.
ఫేస్ బుక్ ఒక చిన్న ప్రాజెక్టుగా వారు కళాశాల ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. అయితే మార్క్ మాత్రం తన విజన్ లో ఈ ప్రాజెక్టు అనేది జనాలందరూ కమ్యూనికేట్ చేసే మరియు వాళ్ళంతా టచ్ లో ఉండే ఒక ప్లాట్ ఫామ్ గా ఉండాలి అని అనుకున్నాడు
మొదట అతను తన నిర్మించిన సైట్ లో వాళ్ల యూనివర్సిటీలో చదివే విద్యార్థులు విద్యార్థినిల ప్రొఫైల్స్ మరియు వారి ఫోటోలను ఉంచాడు. అందరూ విద్యార్థులు ఆసక్తి తో వెబ్ సైట్ ను సందర్శించడం మొదలుపెట్టారు. ఈ కారణంగా హార్వర్డ్ యొక్క నెట్ వర్క్ స్విచ్ లు అధిక ట్రాఫిక్ నో తట్టుకోలేక పనిచేయడం ఆగిపోయాయి. దీంతో యూనివర్సిటీ వాళ్ళు విద్యార్థులకు ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా తాత్కాలికంగా నిలిపివేశారు. అనుమతులు లేకుండా తమ ఫొటోలను వినియోగిస్తున్నారని పలువురు విద్యార్థులు ఫిర్యాదులు కూడా చేశారు. అందుకు జుకర్ బర్గ్ విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పారు.
2004లో అతను ఒక కొత్త వెబ్ సైట్ కు కోడింగ్ రాయడం ప్రారంభించాడు. దీనికి అతను ఫేస్ బుక్ ఇంకా పేరు పెట్టాడు. తన స్నేహితులు ఎడ్వర్డో సావెరిన్, ఆండ్రూ మెక్ కల్లమ్, క్రిస్ హ్యూస్ మరియు డస్టిన్ మోస్కోవిట్జ్ లు ఫేస్ బుక్ కోసం అతనికి సహాయపడ్డారు. వారు వాస్తవానికి Facebook సైట్ సహ-వ్యవస్థాపకులు. ఈ సైట్ ప్రారంభంలో కేవలం హార్వర్డ్ విద్యార్థుల కోసం నిర్మించిన సైట్ గా ఉండేది కానీ తర్వాత ఇతర కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలకు విస్తరించింది.
మార్క్ మరియు స్నేహితులు ఈ ఆలోచనను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని నిర్ణయించుకున్నారు. వీళ్ళ సోషల్ ప్రాజెక్ట్ చాలా వేగంగా ఊపందుకుంది మరియు జుకర్ బర్గ్ కళాశాల చదువు వదిలేసి తన సమయాన్ని పూర్తిగా సైట్ కు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను మరియు అతని బృందం పాలో ఆల్టోలోని ఒక చిన్న ఇంటికి మారారు. మొదట ఇక్కడ నుంచే ఫేస్బుక్ కార్యకలాపాలను ప్రారంభించారు. ఆ చిన్న ఇల్లే వాళ్ళకు సంస్థ కార్యాలయంగా మారింది.
ఇలా ఒక చిన్న ప్రాజెక్టు గా ప్రారంభమైన ఫేస్బుక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మంది యూజర్స్ తో అతిపెద్ద సోషల్ మీడియా దిగ్గజ సంస్థ గా ఎదిగింది.
0 కామెంట్‌లు