మన తెలుగు భాష చాలా గొప్పది. ఈ గొప్పదనం లో తెలుగు పద్యాలకు ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు పద్యాలు మనకు మంచి బుద్ధిని, జ్ఞానాన్ని నేర్పిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇటువంటి పద్యాలను, వాటి భావాలను తెలియజేయడం ద్వారా వారికి మంచి బుద్ది, సత్ప్రవర్తన, మంచి వ్యక్తిత్వాన్ని నేర్పించవచ్చు.
తెలుగు పద్యాలు: 10 వేమన పద్యాలు
1) పద్యానికి భావం:
చెడ్డవాడు ఎప్పుడూ ఆడంబరములు, గొప్పలు చెప్పును. మంచివాడు నెమ్మదిగా నిరాడంబరంగా మాట్లాడును. ఎలా అంటే , తక్కువ విలువైన కంచు గట్టిగా మోగును ,కానీ ఎక్కువ విలువైన బంగారం మ్రోగదు కదా? కావున మంచివాడు ఎల్లప్పుడూ అణుకువతో ఉంటాడు.
2) పద్యానికి భావం:
ఉప్పు మరియు కర్పూరం రెండూ చూడ్డానికి ఒకేలా ఉన్నా, వాటి రుచులు వేరు వేరుగా ఉంటాయి. అలాగే పురుషుల్లో పుణ్య పురుషులు అంటే సత్పురుషులు వేరుగా ఉంటారు.
3) పద్యానికి భావం:
పాడగా పాడగా పాట మధురంగా వస్తుంది. తినగా తినగా చేదుగా ఉండే వేపాకు కూడా తియ్యగా అవుతుంది. అట్లే దృఢసంకల్పంతో ప్రయత్నిస్తే ఎటువంటి పనులనైనా సాధించగలం.
4) పద్యానికి భావం:
ఈ ప్రపంచంలో ఎదుటి వారి తప్పులను ఎత్తి చూపే వారు చాలామంది ఉంటారు. జనులందరిలో ఏదో ఒక తప్పు ఉండనే ఉంటుంది. ఇతరుల తప్పులను చూపించే ఈ జనాలు తమ తప్పులను మాత్రం తెలుసుకోరు అని భావం.
5) పద్యానికి భావం:
తల్లిదండ్రులను దయతో ప్రేమతో ఆదరించకుండా వదిలేసే కొడుకు ఉన్నా లేనట్టే. అలంటి వాడు పుట్టలోనే పుట్టి పుట్టలోనే నశించు చెద పురుగులతో సమానం.
6) పద్యానికి భావం:
మేడిపండు పైకి చూడడానికి నిగనిగ లాడుతూ కనిపిస్తుంది కానీ దానిని చీల్చి చూస్తే పురుగులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పిరికివాడు పైకి గంభీరంగా ధైర్యంగా కనిపించినా లోపల మనసులో భయం ఉంటుంది.
7) పద్యానికి భావం:
వేరుకు పురుగుపడితే ఎంతటి మహావృక్షమైనా నాశనం అవుతుంది. అలాగే చెడ్డవాడి వలన ఎంత గుణవంతుడైన సరే చెడిపోతాడని అర్ధము.
8) పద్యానికి భావం:
మంచి మనసుతో చేసే పుణ్యం తక్కువైనా అది భగవంతుని దృష్టిలో విశేషమైనది. చాలా చిన్నదైన మర్రి విత్తనము పెరిగి మహావృక్షం అవుతుంది కదా!
9) పద్యానికి భావం:
నిర్మలంగా లేని మనసుతో పాటించే ఆచారాలు వ్యర్థం. శుభ్రంగా లేని పాత్రలు తో చేసే వంటలు వ్యర్థం. అలాగే స్థిరత్వం లేని మనసుతో చేసే శివ పూజ కూడా వ్యర్థం.
10) పద్యానికి భావం:
కుండనిండుగా ఉన్న గాడిద పాలు కంటే శ్రేష్టమైన గోవు పాలు గరిటడైనను విలువైనవే అని అర్థం.
0 కామెంట్‌లు