Best 5 fruits for our health in telugu

మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే ఫలాలు:

Apple health benefits in telugu
Apple health benefits in telugu 


ఆపిల్ ఆరోగ్య ప్రయోజనాలు:

శరీర బరువు లావు తగ్గే ఎందుకు సహాయపడుతుంది

ఆపిల్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలే ఆపిల్ ను బరువు తగ్గించే ఆహారంగా చేస్తాయి. మనలో చాలామంది అధిక బరువు తో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.  ఆపిల్ లో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ పండును తీసుకోవడం ద్వారా మీరు ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తినే అవసరం లేకుండా మీ పొట్టను నింపుతుంది మరియు అధికంగా తినకుండా మీ పొట్టకు సంతృప్తినిస్తుంది.

డయాబెటిస్ తగ్గించవచ్చును

ఆపిల్స్ యొక్క మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, ఇవి మధుమేహానికి కారణమయ్యే ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ను దూరం చేస్తాయి. రక్తంలో చక్కెర ను తగ్గించడానికి కీలకమైన పీచుపదార్థాలు ఆపిల్ పండులో సమృద్ధిగా ఉంటాయిి. ఇంకా, ఆపిల్స్ లో ఉండే కరిగే ఫైబర్, పెక్టిన్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.

ఊపిరితిత్తుల ఆరోగ్యం మరియు ఆస్తమా లక్షణాలను మెరుగుపరుస్తుంది

సాధారణంగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుందని తేలింది.  ఆపిల్స్ రోజు తీసుకునే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆపిల్స్ లో ఉండే క్వెరెసిటిన్ ఆస్తమా ఉన్న వారికి ఉపయోగకారిగా ఉంటుంది. క్వెర్సిటిన్ అలర్జీలు మరియు శ్వాస సమస్యల తీవ్రతను సమర్థవంతంగా తగ్గిస్తుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది

ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకునే వారిలో మేధోవైకల్యం వంటి మానసిక వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడించాయి.

ఆపిల్ వంటి తాజా పండ్లు మానసిక ఆందోళన ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా భావోద్వేగ స్వస్థతను మెరుగుపరుస్తాయి.


Guava health benefits in telugu
Guava health benefits in telugu


జామకాయ ఆరోగ్య ప్రయోజనాలు:

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

జామపండులో విటమిన్ సి అత్యంత అధికంగా ఉంటుంది. ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి కంటే జామ పండులో 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, సాధారణ అంటువ్యాధులు, రోగకారక క్రిముల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. 

క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది

జామపండులో లైకోపిన్, క్వెరెసెటిన్, విటమిన్ సి మరియు ఇతర పాలీఫినాల్స్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లుగా పనిచేస్తాయి. ఇవి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీరాడికల్స్ ను తటస్థం చేసి, క్యాన్సర్ కణాల పెరుగుదలను అదుపులో ఉంచుతాయి. జామ పండు లో లైకోపిన్ అధికంగా ఉండటం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడంతోపాటు రొమ్ము క్యాన్సర్ కణాల ఎదుగుదలను కూడా నిరోధిస్తుంది.

మధుమేహాన్ని నియంత్రించడానికి

పండులో ఉండే పీచు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే సాధారణ సమస్య అయిన మలబద్ధకాన్ని కూడా ఈ జామ పండు నిరోధించగలదు.

బరువు లావు తగ్గడానికి సహాయపడుతుంది

పండులో ఉండే పీచు పదార్థం బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. అలాగే పండులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. జామపండ్లను మీరు బరువు తగ్గించే మీ డైట్ లో చేర్చుకోవచ్చు. జామకాయల్లో తక్కువ క్యాలరీలు మరియు ఖనిజలవణాలు, విటమిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారానికి జామజ్యూస్ ఒక మంచి సప్లిమెంట్ గా చెప్పవచ్చు. మీరు తినే కేలరీలను తగ్గించడానికి మీ బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ లో జామకాయను వాడవచ్చు.

జామ మీ జీర్ణవ్యవస్థకు గొప్పగా పనిచేస్తుంది మరియు ఇది అధిక ఫైబర్ ను కలిగి ఉంటుంది కనుక ఇది సహజ మైన లాక్సేటివ్ గా పనిచేస్తుంది. కృత్రిమ తీపి పదార్థాలతో చేసిన మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్ లను, జ్యూసులను తాగే బదులుగా.... ఇంట్లోనే జామకాయ జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

కంటి ఆరోగ్యానికి

జామ విటమిన్ ఎ కూడా అధికంగా కలిగి ఉంటుంది. ఇది మీ దృష్టిని మెరుగుపరుస్తుంది. ఇది కంటి ఇన్ఫెక్షన్లు, శుక్లాలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ కంటి ఆరోగ్యం కొరకు మీరు ఖచ్చితంగా వారానికి ఒక జామపండు తింటూ ఉండడం చాలా మంచిది.

చర్మ సమస్యలకు

జామపండు చర్మ నిర్మాణం మెరుగుపరచడానికి మరియు చర్మ సమస్యలను నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జామపండు మరియు దాని ఆకులలో ఆస్ట్రింజెంట్స్ ఉండటం వలన ఇది చర్మ సంరక్షణకు ప్రభావవంతంగా పనిచేస్తుంది . పండును పచ్చిగా తినడం లేదా దాని ఆకులుతో చేసిన డికాషన్ తో చర్మాన్ని కడగడం ద్వారా చర్మ ప్రయోజనాలు పొందవచ్చు. ఇది ముఖ కండరాలు మరియు వదులుగా ఉన్న చర్మాన్ని టైట్ చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. జామకాయలో విటమిన్ - ఎ, బి, సి మరియు పొటాషియం కూడా సమృద్ధి గానే ఉంటాయి. ఇవి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉండి, డీటాక్సిఫికేషన్ లో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇది చర్మం కాంతివంతంగా అయ్యేందుకు మరియు ముడతలు లేకుండా ఉండేందుకు చర్మానికి సహాయపడుతుంది.

orange health benefits in telugu
Orange health benefits in telugu


ఆరెంజ్ లేదా కమలా పండు ఆరోగ్య ప్రయోజనాలు:

విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది

ఆరెంజ్ లేదా కమలా పండ్లు విటమిన్ సి అధికంగా కలిగి ఉంటాయి. ఒక నారింజ పండు మీ శరీరానికి రోజువారీ కావాల్సిన విటమిన్ సి అందిస్తుంది.  విటమిన్ సి ని తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ లాంటి రోగాలను తగ్గించవచ్చు. ఎందుకంటే ఇది మన డిఎన్ఎకు నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది.

స్కిన్ డ్యామేజ్ ను నివారిస్తుంది

ఆరెంజ్ లోని యాంటీ-ఆక్సిడెంట్స్, వృద్ధాప్య లక్షణాలు కలిగించే ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుండి చర్మాన్ని రక్షించడంలో ఉపయోగపడుతాయి. మీరు తరచుగా రోజు నారింజ పండు తీసుకుంటూ ఉంటే 50 సంవత్సరాల వయస్సులో కూడా మీ చర్మం యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

నారింజపండ్లలో ఉండే విటమిన్ సి ఒక వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సాధారణ జలుబు, సీజనల్ ఇన్ఫెక్షన్ వంటి వైరస్లను ఎదుర్కోడానికి శరీరం యొక్క రోగ నిరోధకత పెంచుతుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు