25 మంచి మాటలు మరియు సూక్తులు తెలుగులో :
"సాధించగలనన్న నమ్మకం, పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి కలలైనా నెరవేర్చుకోవచ్చు"
"సాధించాలనే దృఢమైన సంకల్పం, ఏకాగ్రత ఉన్నప్పుడు మధ్యలో వచ్చే చిన్న చిన్న అడ్డంకులు నీ విజయాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేవు"
"జీవితం అనే యుద్ధంలో, ఓటమి అనే శత్రువుతో ఎన్నిసార్లైనా ఓడిపోవచ్చు. కానీ ఓడిపోయిన ప్రతిసారి పోరాట మెళకువలను మెరుగు పరుచుకుంటూ ఉండాలి"
"ఎంత సుదూర ప్రయాణం అయినా మొదట ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది"
"నిన్ను నువ్వే ముందుకు నెట్టుకుంటూ జీవితంలో సాగిపో, ఎవరో వచ్చి నీకు సహాయం చేస్తారని ఎదురు చూడకు"
" సమయం గడిచేకొద్దీ తర్వాత నువ్వు ప్రారంభించలేకపోవచ్చు, కాబట్టి ఇప్పుడే ప్రారంభించు అనుకున్నది సాధించు"
"గొప్ప విజయాలు సాధించాలంటే అంతే ఎక్కువగా కష్టపడాలి"
"సమయం మరియు ప్రపంచం మీకోసం ఆగిపోవు మీరే వాటితోపాటు పరిగెత్తాల్సి ఉంటుంది"
"చేతకానివాడు సాధించాలనుకున్న పనిలో వచ్చే ప్రతి అడ్డంకులను చూసి భయపడి ఆగిపోతాడు. సాధించాలనుకునే వాడు ప్రతి అడ్డంకిని ఎలా దాటుకుని వెళ్ళాలో అని ఆలోచిస్తాడు"
"గడిచిపోయిన నిన్నటి ప్రభావం ఈరోజుటి మీద పడకుండా చూసుకో"
"మీరు నిద్రలేచే ప్రతిసారి... ఈరోజు నేను ఎంతో కొంత సాధించాలి అనే ధృఢ సంకల్పంతో రోజును ప్రారంభించండి"
"మనం విజయాల కంటే అపజయాలలో ఉన్నప్పుడే జీవితం గురించి ఎక్కువగా నేర్చుకుంటాము. కాబట్టి అపజయాలు లో ఉన్నప్పుడు కృంగిపోకుండా వాటి నుంచి వీలైనంత ఎక్కువగా జీవిత పాఠాలు నేర్చుకోండి"
"మన భయాలు, అపనమ్మకాలు, అడ్డంకులు... ఇవన్నీ మన ఆలోచనల్లో మాత్రమే ఉంటాయి. ఒక్కసారి సాధించాలనుకున్న పనిని మొదలు పెట్టి ముందుకు సాగితే అవన్నీ ఉండవు"
"నీ దగ్గర ఏదైతే ఉందో దానితోనే ప్రారంభించు, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నుంచే ప్రారంభించు. ప్రపంచంలోని గొప్ప గొప్ప వ్యక్తులంతా మొదట్లో చిన్నచిన్న అడుగులు వేసిన వాళ్లే"
"పూలబాట లాంటి జీవితం కావాలంటే మొదట్లో అనేక ముళ్ళ బాటల్లో వెళ్ళవలసి ఉంటుంది"
"వయస్సు అనేది శరీరానికి మాత్రమే, మీ ఆలోచన కి కాదు. సాధించాలనుకుంటే వయస్సు ఏమాత్రం అడ్డంకి కాదు. ఈ నవీన ప్రపంచంలో శరీర బలం కంటే బుద్ధిబలానికి విలువ ఎక్కువ ఉందని గుర్తుపెట్టుకో"
"ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి సులభమైన మార్గం - నువ్వు ఆ పనిని ఇష్టంతో చేయడమే"
"వ్యాపారాన్ని ప్రారంభించే దశలో నువ్వు గొప్పవాడివి కావాల్సిన అవసరం లేదు, కానీ నీ ఆలోచన మాత్రం గొప్పగా ఉండాలి. అదే నిన్ను గొప్పవాడిని చేస్తుంది"
"అపజయాలు వచ్చినప్పుడు వెనకడుగు వేయని వాళ్ళకి ఏదో ఒక రోజు తప్పకుండా విజయం సిద్ధిస్తుంది"
"గతం నిన్ను ఎలా తొక్కింది అనేది ముఖ్యం కాదు, భవిష్యత్తును నువ్వు ఎలా మలచుకుంటావో అనేదే ముఖ్యం"
"మంచి సమయం వస్తుందిలే అని ఎదురు చూడకండి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని విజయాలు సాధించండి"
"మన ప్రమేయం లేకుండా మనల్ని ఇతరులు చెడగొట్ట లేరు"
"మన జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యను ఒక వరం లాగానే తీసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి సమస్యలు కష్టాలు లేకపోతేే మన వ్యక్తిత్వ వికాసం చెందదు"
"మంచిని మాత్రమే తెలుసుకున్న వాడు అమాయకుడు అవుతాడు, చెడుని మాత్రమే తెలుసుకున్నవాడు రాక్షసుడు అవుతాడు. మంచి, చెడు రెండూ తెలుసుకుని మంచి మార్గంలో వెళ్లే వాడు జ్ఞాని అవుతాడు"
"జీవితంలో వాస్తవంగా జరిగేది 10 శాతం మాత్రమే... మిగతా 90 శాతం జరిగిన దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది"
2వ పేజీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
(Note:- All these motivational quotes are strictly copyrighted. Not for commercial use)
0 కామెంట్‌లు