ఎలాన్ మస్క్ సక్సెస్ స్టోరీ తెలుగులో:
మస్క్ దక్షిణాఫ్రికాలో ఒక ఇంజనీర్ తండ్రికి, మోడల్ అయిన తల్లికి జన్మించాడు. ఎలాన్ మస్క్ సమాజం లో ఎక్కువగా తిరిగే వ్యక్తి కాదు. ఎల్లప్పుడూ పుస్తకాలతో మరియు కంప్యూటర్లతో గడిపేవాడు.
Elon musk success story |
కెరీర్ ప్రారంభంలో ఎలాన్ ఒక ఆర్థిక సంస్థలో ఇంటర్న్ గా పనిచేశాడు. ఆ సమయంలో ఆర్థిక రంగంలోని వారంతా సంప్రదాయ పద్ధతుల్లో పనిచేయడానికి మొగ్గు చూపారు. అయితే సంప్రదాయబద్ధంగా ఉండని ఎలాన్ ఆన్ లైన్ బ్యాంకు మరియు ఆన్లైన్ పేమెంట్ గురించి భిన్నంగా ఆలోచించడం ప్రారంభించాడు.
ఈ సమయంలో అతను X.com ఆన్ లైన్ చెల్లింపుల సంస్థను ప్రారంభించాడు. దీనినే తర్వాత PayPal గా పేరు మార్చారు. ఆన్ లైన్ చెల్లింపుల మార్కెట్లో PayPal మార్కెట్ లీడర్ గా ఎదిగింది.
అలాగే, ఎలాన్ మస్క్ అంతరిక్ష పరిశ్రమలోకి ప్రవేశించి spaceX సంస్థను నెలకొల్పి విజయాలు సాధిస్తున్నాడు. ఇప్పుడు అంతరిక్షపరిశ్రమలో అగ్రనామాలలో ఒకటిగా ఉన్న స్పేస్ఎక్స్ చరిత్రలో మొదటిసారిగా అంతరిక్షానికి ప్రయాణికులను తీసుకెళ్లే విమానాల తయారీ మొదలు పెట్టింది.
మొదట్లో చాలామంది ఎలాన్ మస్క్ ఆలోచనలను విని వాటిని కలలు గా అభివర్ణించారు. కానీ తర్వాత ఆయన ఆలోచనలు నిజమై వాస్తవ రూపాన్ని దాల్చాయి. అతను సీరియల్ ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదిగిపోయాడు. నిరంతరం కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి, కొత్త వ్యాపారాలను ప్రారంభించే ఒక వ్యవస్థాపకుడిగా మారాడు. ఒకటి కంటే ఎక్కువ పరిశ్రమల్లో తన ఆలోచనలను అమలు చేసిన వ్యక్తి ఎలాన్ మస్క్. అతను ఈ వ్యాపారాలను ప్రారంభించడమే కాకుండా, అతను టచ్ చేసిన ప్రతి పరిశ్రమను విప్లవాత్మకం చేసాడు. ఆన్లైన్ పేమెంట్ (PayPal), ఎలక్ట్రిక్ కార్లు (టెస్లా), రాకెట్ టెక్నాలజీ (స్పేస్ఎక్స్), మరియు శక్తి సేవలు (SolarCity) ఇలా అన్ని రంగాల్లో తన కంపెనీలను విజయవంతం చేస్తున్నాడు.
0 కామెంట్‌లు