ఎస్ ఈ ఓ (SEO) అంటే ఏంటి?
SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది మీ సైట్ కు ఎక్కువ ట్రాఫిక్ రప్పించడానికి, గూగుల్, బింగ్, యాహూ మరియు ఇతర సెర్చ్ ఇంజిన్ లపై మీ పేజీని మరింత ర్యాంక్ చేయడానికి సహాయపడుతుంది.SEO వెబ్ సైట్ యొక్క పేజీలను ఆప్టిమైజ్ చేయడం, కీవర్డ్ రీసెర్చ్ చేయడం మరియు ఇన్ బౌండ్ లింక్ లను సంపాదించడం ద్వారా పనిచేస్తుంది. వెబ్ పేజీ సెర్చ్ ఇంజిన్ ద్వారా ఇండెక్స్ చేయబడిన తరువాత SEO యొక్క ఫలితాలు కనిపిస్తాయి.
ఎస్ ఈ ఓ(SEO) అవసరం ఏంటి?
సాధారణంగా జనాలు ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ ఇంజన్లో వెదికినప్పుడు మొదటి పేజీ లో వచ్చే వెబ్ సైట్స్ కు మాత్రమే వెళ్లి చదువుతుంటారు. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ లో మొదటి పేజీలో వచ్చే వెబ్ సైట్స్ కు మాత్రమే ఎక్కువగా ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. తర్వాత పేజీల్లో ఉండే వెబ్సైట్స్ తక్కువ ట్రాఫిక్ పొందుతుంటాయి.కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ వెబ్ సైట్ ని గూగుల్ సెర్చ్ లో మొదటి పేజీలో రావాలని కోరుకుంటారు. కానీ లక్షలకొద్దీ ఉన్న వెబ్ సైట్స్ తో పోటీపడి మన వెబ్ సైట్ ముందుకు రావాలి అంటే అంత సులభం కాదు. దీని కోసమే మనం SEO చెయ్యాల్సి ఉంటుంది.
SEO చేయడం వలన ఉపయోగాలు:
- మీ వెబ్సైట్లో కంటెంట్ క్వాలిటీ గా ఉండి మరియు SEO బాగా చేసినట్లయితే మీ సైట్ కు ట్రాఫిక్ ఎక్కువగా వస్తుంది.
- మీ సైట్ యొక్క ర్యాంకు మరియు స్థానం మరింత మెరుగు పడుతుంది.
- ఎస్ ఈ ఓ బాగా చేసినట్లయితే, మీ సైట్ గురించి ప్రచారం చేయడం కోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.
- ఇతర సైట్లు కంటే మీ సైట్ మరింత ముందుకు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి.
SEO చేసే వివిధ మార్గాలు/ విధానాలు:
- పొడవైన ఆర్టికల్స్ రాయాలి
- ఇతర వెబ్సైట్ల కంటే భిన్నంగా మరియు తాజాగా ఉండేలా పోస్టులు రాయండి
- ప్రతి ఆర్టికల్ లో సరైన కీవర్డ్ లను ఉపయోగించండి
- మీ సైట్ ఇమేజ్ లను ఆప్టిమైజ్ చేయాలి
- మీ URL లను ఆప్టిమైజ్ చేసుకోండి
- బ్యాక్ లింక్ లను లింక్ చేసుకోండి
- మీ సోషల్ మీడియాను ఆప్టిమైజ్ చేయండి
- సైట్ స్పీడ్ పరిగణనలోకి తీసుకోండి
- మీ వెబ్ సైట్ ని మొబైల్ ఫ్రెండ్లీగా చేయండి
- సైట్ మ్యాప్ క్రియేట్ చేయాలి
- robots.txt ఫైలు క్రియేట్ చేయాలి.
0 కామెంట్‌లు