ఆలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు జాక్ మా సక్సెస్ స్టోరీ:
జాక్ మా 1979 సెప్టెంబర్ 10న చైనాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. పేద కుటుంబం కావడంతో తన చిన్నతనంలో పేదరికంలో ఉన్న అన్ని కోణాలను చూసాడు.
Alibaba company founder Jack Ma |
చిన్నతనం నుంచే ఆంగ్ల భాష నేర్చుకోవడం, అర్థం చేసుకోవడంలో ఆయనకు ఎంతో ఆసక్తి ఉండేది. చైనా కమ్యూనిస్ట్ దేశం కాబట్టి వారి ప్రధాన భాష అయిన చైనా భాషకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇంగ్లీషు భాష నేర్పించడం మీద అక్కడి గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి సారించలేదు. అయినప్పటికీ, అతను 13 సంవత్సరాల వయస్సులో ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించాడు.
అతను విదేశాల నుండి వచ్చే పర్యాటకులకు సహాయం చేస్తూ, పర్యాటక మార్గదర్శి గా ఉంటూ వారి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇలా 6 సంవత్సరాలపాటు, అతను పర్యాటక మార్గదర్శిగా పని చేయడంతో అతనికి ఇంగ్లీష్ భాష మరియు పాశ్చాత్య దేశాల సంస్కృతి పై మంచి అవగాహన ఏర్పడింది.
జాక్ మా రాత్రికి రాత్రే విజయవంతం అవ్వలేదు. అతను ఎన్నో వైఫల్యాలను తన జీవితంలో ఎదుర్కొన్నాడు. అతను ప్రాథమిక పాఠశాలలో రెండు సార్లు విఫలమయ్యాడు. మిడిల్ స్కూల్ కు వచ్చిన తరువాత ఈ సంఖ్య పెరిగింది. అతను మిడిల్ స్కూల్ లో మూడు సార్లు విఫలమయ్యాడు.
స్కూల్ పూర్తి చేసి కాలేజీలో చేరగానే మూడుసార్లు ఎంట్రెన్స్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి దాదాపు 10 సార్లు దరఖాస్తు చేసుకుంటే ప్రతిసారీ తన దరఖాస్తు తిరస్కరించబడింది. కాలేజీ తర్వాత కూడా ఉద్యోగం సాధించడం లో విఫలం అయ్యాడు. దాదాపు 30 సార్లు రకరకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా ఎక్కడ ఉద్యోగం రాలేదు. తర్వాత ఎలాగో ఒక టీచర్ ఉద్యోగం సంపాదించి ఇంగ్లీష్ టీచర్ గా పని చేయడం ప్రారంభించాడు.
కొంత కాలం గడిచిన తర్వాత తానే స్వయంగా వ్యాపారం చేయాలని భావించాడు. మొదట్లో రెండు సార్లు వ్యాపారంలో విఫలమయ్యాడు.
చైనాలో వెబ్ సైట్ దాని శైశవ దశలో ఉన్నప్పుడు వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాల గురించి ఆయన ఆలోచించాడు. 1995లో, చైనాలో కంప్యూటర్లు ఇంకా గృహోపకరణ వస్తువుగా మారనప్పుడు అతను ఆన్ లైన్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. 1999లో అతను B2B మార్కెట్ ప్లేస్ సైట్ గా ఆలీబాబాను ఏర్పాటు చేశాడు. ఆలీబాబా విదేశీ కొనుగోలుదారులతో చైనా ఎగుమతిదారులు అనుసంధానం కావడానికి దోహదపడింది. తరువాత అలీబాబా కంపెనీ పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించగలిగింది.
తన కంపెనీ ఆలీబాబా ను చైనాలోని మారుమూల గ్రామాలకు అందుబాటులోకి తీసుకువచ్చే విజయం సాధించాడు. 2014లో అలీబాబా కంపెనీ IPOలో, న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ (NYSE) లో జాబితా చేయబడినప్పుడు అది $25 బిలియన్లు సేకరించి జాక్ మాను బిలియనీర్ ని చేసింది. తన బిజినెస్ ను కృత్రిమ మేధస్సు, ఆరోగ్య సంరక్షణ, హాలీవుడ్ సినిమా మొదలైన రంగాల్లో కూడా విస్తరించాడు. ఆలీబాబా ను స్థాపించిన 20 సంవత్సరాల లోపే జాక్ మరియు అతని సహ వ్యవస్థాపకులు నిర్మించిన వ్యాపారం విలువ 420 బిలియన్ డాలర్లు అయ్యింది.
ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలో జాక్ మా రెండవ స్థానంలో కొనసాగుతున్నారు.
అమెజాన్ స్థాపకుడు సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 కామెంట్‌లు